అప్పుడెప్పుడో..
మా Y2K make అమ్మాయి.. అంటే 2000 సంవత్సరంలో పుట్టిందిలెండి..
దానికి కాస్త "సున్నితత్వం" ఎక్కువన్నమాట.. అంటే.. ఈ సున్నితత్వం తాలూకు లక్షణాలు మచ్చుకి కొన్ని..
వేసుకున్న కొత్తబట్టల్ని "రికార్డు టైము"లొ చింపేసుకోవడం.. ("గోనె సంచీలతో కుట్టించాలే నీకు బట్టలు.." వాళ్లమ్మ ఉవాచ!),
అప్పుడే షాపు నించి కొనుక్కొచ్చిన బొమ్మల్ని ఆనమాలు గుర్తుపట్టలేనంతగా చేసెయ్యడం ("నీ దగ్గర ఇనుముతోటీ, ఇత్తడితోటీ చేసినవైనా నిలుస్తాయో,లేదో?",మళ్లీ వాళ్లమ్మే!!)
..
..
..
అన్నిటికంటే.. ఎక్కడో చూస్తూ నడుస్తూ, పక్కనున్నవాళ్లవీ, దాని దారిలో ఉన్నవాళ్లవీ "పాదపీడనం" చేసి వాళ్లచేత "కెవ్వ్" అని కేకలు పెట్టించడం..ఇట్లాంటివన్నమాట!
ఇలా పైన ఉదహరించినవాటిలో ఏ ఒక్కటి జరిగినా, రెండు జరిగినా, నాలుగైదు ఒకేసారి జరిగినా.. అప్పుడు దాన్ని కోపంతో, ఏమీ చెయ్యలేని నిస్సహాయతతో, కాలు పచ్చడి అయిపోవడంతో కళ్ల వెంబడ నీళ్లు తిరుగుతుంటే "(మాయా)శశిరేఖా!.." అని ముద్దుగా(?) "అక్షింతలు" వేసేవాళ్లం.
మొన్నటికి మొన్న..
మా బుడ్డిగాడు.. ఎల్లికేజీ చదువుతున్నాడులెండి..(LKGని అలానే అనాలట.. వాడే చెప్పాడు).
వీడు ఈమధ్యనే సింగీతం శ్రీనివాశరావుగారి "ఘటోత్కచ" సినిమా చూసాడు. వాళ్లక్క చూపించిందిలెండి. అప్పటినుంచి చేతిలో ఏది ఉంటే దాన్ని.. పెన్సిల్ కానీ,పెన్నుకానీ, గరిటె కానీ, స్పూను కానీ.. భుజాన గదలా ధరించి, "నేనే ఘటోత్కచ..నేనే ఘటోత్కచ.." (ఆతర్వాత ఏంటో వాడికీ రాదు, నాకూ తెలియదు!) అని పాడుకుంటూ తిరిగేస్తూ ఉంటాడు.
నిన్న రాత్రి..
పడుకోవటానికి సన్నాహాలు చేస్తున్నాము.
నాకు ఒక పక్కన పడుకున్న మా బుడ్డిగాడు పడుకుని వాడిలో వాడే వాడి టైటిల్ సాంగు ("నేనే ఘటోత్కచ..నేనే ఘటోత్కచ..") పాడుకుంటున్నాడు.
"చాల్లేరా ఘటోత్కచా.. ఇంక పడుకో!" అన్నాను.
సడెన్‌గా వాడికి ఒక పెద్ద సందేహం వచ్చింది.. "నానా! ఘటోత్కచుడి వాళ్ల అక్క పేరు ఏమిటి?" అని.
వాడి థియరీ ప్రకారం, అబ్బాయిలందరికీ అక్కలుండాలి, అమ్మాయిలందరికీ తమ్ముళ్లుండాలి.
"శశిరేఖ.." కాస్త కసిగా ఒత్తిపలుకాను,అంతకుముందే నా మీదకిదూకి నా నడుము విరగ్గొట్టినంత పనిచేసి, ఇప్పుడు నంగనాచిలా నా పక్కన పడుకున్న వాళ్ల అక్కని చూపిస్తూ.
అప్పుడే మా ఆవిడ పడకగదిలోకి వేంచేసింది.
ఇంతలో మావాడికి ఇంకో సందేహం, (అదేదో సినిమాలో, గిరిబాబు "భగవంతుడా! కూతుర్నుఇమ్మంటే, క్వశ్చన్ బ్యాంకుని ఇచ్చావా?" అన్నట్టు).
"మరి వాళ్ల నాన్న పేరు ఏమిటి?"
"భీముడు" అన్నాను నేను, కాంప్లాన్ బాయ్‌లా రెండు చేతులూ గాల్లోకి ఎత్తి బిగించి పట్టి, కండల్ని చూపిస్తూ. మా ఆవిడ మూతి ముప్పైఆరు వంకరలు తిప్పింది.
మళ్లీ మా క్వశ్చన్ బ్యాంకు అక్షయతూణీరంలోంచి ఇంకో బాణం, "మరయితే, వాళ్లమ్మ పేరు?" అని.
నా గొంతులో పచ్చివెలక్కాయ పడింది.
అప్పటికే మా ఆవిడ ముక్కుపుటాలు అదురుతున్నాయి.. చెవుల్లోంచి ఆవిరిపొగలు చిమ్ముతున్నాయి.. మూడో కన్ను తెరుచుకుంటోంది..
పరిస్థితిని గమనించి నేను గమ్మునుండిపోయాను.
"చెప్పు నాన్నా!! ఘటోత్కచుడూ వాళ్లమ్మ పేరు ఏమిటి?", ఈతడవ నా పుత్రికారత్నం.
అప్పుడొచ్చింది సునామీ..
"నేను చెప్తాను.. నువ్వు శశిరేఖవై, నీ తమ్ముడు ఘటోత్కచుడై, మీ నాన్న భీముడైతే.. అప్పుడు నేనయ్యేది ఏమిటో తెలుసా.. హిడింబి..అంటే రాక్షసి.. అదే నేను.. అర్ధమయ్యిందా?" అంటూ కోపం స్థానంలో కళ్లల్లో నీళ్లు తిరుగుతున్న నా శ్రీమతిని చూసి, పిల్లలిద్దరూ ఏమి చెయ్యాలో తోచక బల్లుల్లా నన్ను అతుక్కుపోతే, మా అవిడని బతిమాలి,బుజ్జగించి మామూలు మనిషిని చెయ్యటానికి నేను జాగారం చెయ్యాల్సిచ్చొందంటే.. మీరు నమ్మాలి!!!.
మీ బ్లాగుకి రావడం ఇవాళే మొదలు. చాలా బాగుంది.. ముఖ్యంగా ముగింపు..ట్విస్ట్ ఊహించిందే అయినా మీరు రాసిన విధానం కళ్ళల్లో నీళ్లు తిరిగేలా నవ్వించింది..
రిప్లయితొలగించండిbagundi
రిప్లయితొలగించండిha...hha...hhaa........
రిప్లయితొలగించండిచాలా బాగా రాసారు..!
రిప్లయితొలగించండిఅభినందనలు.
haha buddigaru :D
రిప్లయితొలగించండిLOL mee vADi valla sivarAtri mundu jArAgam rehearsal ayaindi mottaniki :D
మాదీ తెనాలే!
రిప్లయితొలగించండిమీ శైలి బాగుంది.అయినా పిల్లలమాటలకు కళ్ళలో నీళ్ళు తిరిగేలా ఉడుక్కోవాలా మీ శ్రీమతిగారు..బాగలేదు
రిప్లయితొలగించండి@ మురళి గారు, బుజ్జి గారు, పరిమళం గారు, మధురవాణి గారు
రిప్లయితొలగించండినెనర్లు
@ అన్వేషి గారు
అవును సార్! అట్లాంటిదే!
@cbrao గారూ!
మరీంకేం.. అందుకోండి..
"మీది తెనాలే! మాది తెనాలే! మనది తెనాలే!.. "
:-)
@ విజయమోహన్ గారు
నేను ఏమి చెయ్యగలను చెప్పండి. నిమిత్తమాత్రుడ్ని..
మన బ్లాగు సోదరుడు ఒకాయన అన్నట్టు..
"మా ఆవిడింతే.. మరి మీఅవిడో?"
:-)
ఈ టపా కూడా అదిరింది..
రిప్లయితొలగించండిఅబ్బ, అచ్చు నా లక్షణాలన్నీ పుణికి పుచ్చుకున్న చిట్టి చెల్లాయి ఒకర్తి ఉందని నాకింతవరకూ తెలీనే తెలీదు. పైగా నా పేరే పెట్టారు! బలే...బలే! :)
రిప్లయితొలగించండిబాగా నవ్వించింది మీ పోస్టు!
by the way నేనూ ఇలాగే బట్టలు చింపుకునేదాన్ని కాదుగానీ...చెప్పులు తెంపేస్తూ ఉండేదాన్ని. :D
రిప్లయితొలగించండి@ఆ.సౌమ్య గారు: ఇప్పుడు చెప్పులు కూడా ఆ లిస్టులో చేరిపోయాయండీ :-(.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి