ఈ డైలాగు ఎక్కడో విన్నట్టుంది కదూ!!!
ఎక్కడో ఏవిటీ? సరిగ్గా తాళికట్టే సమయానికి ఎన్ని సినిమాల్లో, ఎన్ని కష్టాలు పడి, ఎందరు వచ్చి, ఎన్ని భావావేశాలతో (కోపంతో, బాధతో, ఆవేశంతో, ఆక్రోశంతో, భీభత్సంతో.. వగైరా వగైరా) అనలేదూ ఈ "ఆపండీ!" డైలాగుని అనుకుంటున్నారు కదూ!!! అదంతా సినిమాల్లోనండీ బాబూ!
కాని, నిజజీవితంలో మీరు ఎన్ని పెళ్లిళ్లకి వెళ్లుంటారు, ఎన్ని పెళ్లిల్లు చూసుంటారు, ఎన్ని పెళ్లిళ్లు చేసుకుని ఉంటారు (క్షమించాలి.. మామూలుగా అయితే ఒక్కొక్కళ్లకి ఒక్కొక్క పెళ్లే - కాని అందరికీ కలిపి, వ్యాకరణ దోషాల్లేకుండా చెప్పాలంటే, బహువచనం వాడాల్సి వచ్చింది - అందువల్లచేత అన్నమాట!). అలా నిజజీవితంలో మీరు ఈ డైలాగు ఎప్పుడన్నా విన్నారా?
"పాపము శమించుగాక!"
"అమంగళము ప్రతిహతమగుగాక!"
"నీకిదేంపొయ్యేకాలం.." అనుకుంటున్నారుకదా!!
కాని ఏంచేస్తాం.. ఇది కలికాలం..
నేను నా చెవులారా విన్నాను ఆ డైలాగుని..
ఇంకా చెప్పాలంటే.. ఎక్కడో కాదు..
నా నిజజీవితంలోనే..!
అచ్చంగా నా పెళ్లిలోనే..!
నాకంటూ జరిగిన ఒక్కగానొక్క పెళ్లిలోనే..!
ఎందుకు? ఏమిటి? ఎలా? హౌ? "ఏమి జరిగిందో నాకు తెలియాలి.." అంటారా.. మరి నాతో వచ్చెయ్యండి, ఓ పుష్కరం వెనకాలకి..
వచ్చారా?
ఇవాళ మార్చ్ ఇరవయ్యో తారీఖన్నమాట!
సందర్భం: నా పెళ్లి
సమయం: రాత్రి 9:21 దాటింది..
అదేమిటి? ఎవరైనా 9 దాటింది, తొమ్మిదిన్నర దాటింది అంటారు.. నువ్వేమిటి 9:21 దాటింది అంటావేంటంటారా? అక్కడికే వస్తున్నా..
9:21 కి ముహూర్తం అన్నారు.. అంటే 9:21 కి జీలకర్రా బెల్లం పెట్టాలి కదా? ఆ కార్యక్రమం అయిపోయి, ఇంకాసేపు అయిందన్నమాట!
సరే! తదుపరి కార్యక్రమం మాంగళ్యధారణ.
పురోహితులు మంత్రాలు వల్లిస్తున్నారు. మంగళవాయిద్యాలు మారుమ్రోగుతున్నాయి.
పెద్దలందరూ చేతులలో అక్షింతలతో ఆశీస్సులు అందచెయ్యడానికి సిద్ధంగా ఉన్నారు.
వరుడు (నేను), వధువు (నా శ్రీమతి) మా పెళ్లిపుస్తకంలో రంగవల్లికలు దిద్దడానికి సంసిద్ధులమయ్యాము..
నేను వధువుకి అభిముఖంగా నిల్చున్నాను.
పురోహితుడు నా చేతిలోకి తాళిని ఇచ్చి, వధువు మెళ్లో వేళాడేటట్టు పట్టుకోమన్నారు. వధువుని కిందనుంచి తాళిని పట్టుకోమన్నారు.
ఒకామెడ వెనకనించి వధువు పూలజడని పైకి ఎత్తి పట్టుకున్నారు.
పురోహితుడు మంత్రాలు చదువుతున్నారు.
గట్టిమేళం వాయించమన్నారు.
"మూడు ముళ్లు వెయ్యి నాయనా!" అని నాతో అని "మాంగళ్యం తంతునానేనా.." అందుకున్నారు పురోహితులు.
వాయిద్యాలు గాట్టిగా మ్రోగుతున్నాయి.
నాలో ఎన్నో భావోద్వేగాలు.. చేతుల్లో చిన్న తొట్రుపాటు..
అలా సన్నగా వణుకుతున్న చేతులతో, ఒంగొని, ఒక రకమైన స్వప్నావస్థలో, నా చేతులలో ఉన్న రెండు కొసలనీ ముళ్లు వేస్తున్నాను..
అదిగో.. అప్పుడు..
సరిగ్గా అప్పుడంటే అప్పుడు..వినబడింది..
"ఆపండీ.." అని..
ఒక సారి కాదు, రెండు సార్లు కాదు, మూడు సార్లు..
"ఆపండీ.." "ఆపండీ.." "ఆపండీ.." అని
కాకపోతే, ఈ టపా మొదట్లో అనుకున్నట్టుగా కోపం, బాధ, ఆవేశం వగైరాలతో కాదు.. ఇంకా చెప్పాలంటే కాస్త ఖంగారుగా!
అప్పటికి నేను నా "స్వప్నావస్థ"లోంచి బయటపడి, అలా అన్నవారివైపు చూసాను.
అలా అన్నది, వధువు జడ ఎత్తిపట్టుకొని వెనకాలనిల్చున్న తన మేనత్త (తర్వాత తెలిసింది). ఆవిడ గొంతులోనే కాదు, కళ్లల్లో కూడా ఖంగారు..
నేను ఆవిడవైపు చూసేసరికి అన్నారు "మూడు ముళ్లు అయిపోయినాయి బాబూ!" అని.
"..ఒదిలేస్తే ముప్పై ముళ్లేసేటట్టున్నావ్.." అన్నట్టు ఆమె కళ్లల్లో భావం.
ఏమి చేస్తాం.. ఒక వెర్రి నవ్వు నవ్వి నిటారుగా నిల్చున్నాను.
పురోహితుడు నా చేతుల్లోకి అక్షింతలు ఇచ్చి "ముడుల" మీద వెయ్యమన్నారు. వేసాను.
ఈతడవ మళ్లీ ఇంకో తాళిబొట్టు ఇచ్చి (ఒకటి మగపెళ్లివారిదీ, మరొకటి ఆడపెళ్లివారిదీ కదా?) కట్టమన్నారు.
మళ్లీ ఆవిడే జడ ఎత్తిపట్టుకున్నారు. నేను చాలా బుద్ధిగా "ఒకటీ", "రెండూ", "మూడూ" అని జాగ్రత్తగా లెక్కపెట్టి ముళ్లువేసి, అక్షింతలు వేసి ఆవిడవంక చూసి, "విజయదరహాసం" చేసాను.
ఆవిడమాత్రం "ఆ.. కట్టావులే తాళి.." అన్నట్టు చూసి చిరునవ్వుతో అక్కడనుండి వెళ్లిపోయింది.
ఆతర్వాత ఇక అక్షింతలు, ఆశీర్వచనాలు, చదివింపులు .. అన్నీ మామూలే!.
ఇకపోతే, ఇప్పుడు కొన్ని పక్కదీపాలు.. (హై లైట్సు, సైడు లైట్సు లో సైడు లైట్సు అన్నమాట!)
- ఇప్పటికీ, ఎప్పుడైనా నా శ్రీమతి మా పెళ్లి క్యాసెట్టు గనక చూస్తూ ఉంటే, "తాళికట్టు శుభవేళ.." వచ్చేసరికి "ఏవండోయ్! " అని నన్ను పిలిచి మరీ చూపిస్తూ ఉంటుంది. చూసి నవ్వుకుంటూ ఉంటాము.
- ఈ విషయం ఆనోటా ఈనోటా తెలిసో, లేకపోతే మా పెళ్లి క్యాసెట్లో చూసో గాని, మా చుట్టాల్లో నా తర్వాత పెళ్లైన మగపిల్లలందరూ "బుద్ధిగా" తాళికట్టారు.
- నా శ్రీమతి మేనత్త ఇంకెప్పుడూ ఎవ్వరి పెళ్లిలోనూ వధువు జడ ఎత్తిపట్టుకునే సాహసాలు చెయ్యలేదు. ఆవిధంగా ఫొటోల్లోనూ, వీడియోలోనూ పడడాన్నిగూడా త్యాగం చేసేసారు.
అయ్యా! అదండీ సంగతి..

:) బాగా రాసారు. మీ టపాలు అన్నీ చదివాను. చాలా బాగా రాసారు.
రిప్లయితొలగించండిబాగౌంది :-))
రిప్లయితొలగించండి@శిశిర గారు - నా టపాలన్నీ చదవడానికి సమయం కేటాయించినందుకు థాంక్సండీ.
రిప్లయితొలగించండి@ మాలాకుమార్ గారు - థాంక్సండీ
హహహ బావుంది మీ పెళ్ళి ముచ్చట....బాగా రాసారు.
రిప్లయితొలగించండిnice narration...
రిప్లయితొలగించండి@అ.సౌమ్యగారు: థాంక్సండీ.
రిప్లయితొలగించండి@శరత్‌గారు: :-)
@సాయిగారు: థాంక్సండీ.
:) nice. నేనూ కంగారు పడ్డాను. ఏమయ్యుంటుందో అని.
రిప్లయితొలగించండిబ్లాగ్ నేమ్ చూసి, మ౦జు గారు వ్రాసారనుకున్నాను.సూపర్ సస్పెన్స్, కామెడీ తో వ్రాసారు :))
రిప్లయితొలగించండి@కృష్ణప్రియ గారూ - థాంక్సండీ..
రిప్లయితొలగించండిఆ టైములో నేనెంత ఖంగారు పడ్డాననుకున్నారు!!! Thank God :-)
@మౌళిగారూ - థాంక్సండీ..
నాకు కూడా అప్పుడప్పుడూ ఆ confusion వస్తోందండీ.. :-)