రెండు వారాల క్రితం, బెంగళూరులో ఉండే మా తమ్ముడు ఆఫీసుపనిని (స్వామికార్యాన్ని) వారాంతంతో (స్వకార్యంతో) కలుపుకుని హైదరాబాదు వచ్చాడు. మా మరదలికి సెలవు కుదరకపోవడంతో తను రాలేకపోయింది.
ఆదివారంనాడు మధ్యాహ్నం భోజనాలు ముగించి, ఏవో కబుర్లలో పడితే, వేగుల (మా పిల్లలు) ద్వారా మా సినిమాహాల్లో (హోం థియేటరులో) ఏదో సినిమా ప్రారంభం కాబోతుందని సమాచారం అందింది. దాంతో సీను హాల్లోకి మారింది.
ఆనాడు ప్రదర్శించబడుతున్న చిత్రరాజం - అన్నపూర్ణావారి "తోడికోడళ్లు(1957)".
నేనేదో హోం థియేటర్ అని కాస్త ఎక్కువగా చెప్పాననుకుంటునారా?. లేదండీ బాబూ!. మేస్త్రీ సినిమాకి దానారావుగారుకి ఉత్తమనటుడుగా నంది అవార్డు వచ్చిందన్నంత పచ్చి నిజ్జం .
మా ఇంట్లో ఉన్నది నిజంగానే హోం థియేటరే!. కాకపోతే మా హోం థియేటరుకి అర్ధమయ్యే భాష ఒక్కటే.. తెలుగు.
అందులో ఆడే సినిమాల్లో రెండే రంగులు ఉంటాయి.. తెలుపు, నలుపు. దీనికి ఒకటో, రెండో మినహాయింపులున్నాయిలెండి. నాకు తెలిసినంతవరకూ మా ఇంట్లో ఉన్న లేటెస్టు సినిమా అంటే.. స్వాతికిరణమో, సీతారామయ్యగారి మనవరాలో. అది కూడా ఒకటి విశ్వనాథ్ సినిమా అవటంవలానూ, రెండోది ఏయన్నార్‌ది అవటంవల్లనూ..
(మా నాన్నగారు ఏయన్నార్‌కి వీరాభిమానిలేండి. ఒక యాంగిల్లోంచి చూస్తే, ఏయన్నార్‌లానే కనపడతారని స్టూడెంట్లు అనుకునేవారట. నా శ్రీమతి చెప్పింది. తనుకూడా ఒకప్పుడు ఆయన స్టూడెంటేలెండి. దీని గురించి మనమెప్పుడైనా తీరిగ్గా బ్లాగాడుకుందాం)
ఇక్కడో చిన్న ముందుమాట: చదువరులలో ఎవరైనా ఈ సినిమా చూసిఉండకపోతే (ఏదో.. నా అఙ్ఞానంతో ఇలా మాట్లాడాననుకుంటే నన్ను క్షమించెయ్యాల్సిందిగా మనవి), మాలా కుమార్‌గారి కమ్మటికలలు లో చూడొచ్చు.
సరే! విషయంలోకి వస్తే.. మేమందరం మా మా ఉచితాసనాలని స్వీకరించి సినిమా మీదకి దృష్టి సారించాము. చూస్తూండగానే, "గాలిపటం గాలిపటం" పాట అయిపోయింది.
సుశీల ..అదేనండీ మన సావిత్రి ప్రవేశం. ఎక్కడి దొంగలు అక్కడే గప్‌చుప్!
...
...
సావిత్రి కన్నాంబని అడుగుతోంది, "మందులు వేసుకున్నావా అక్కయ్యా?" అని.
కమల ఏదో చెప్తోంది. అప్పుడు నా శ్రీమతికి గుర్తొచ్చింది, "అత్తయ్యా! మందులు వేసుకున్నారా?" అని అడిగింది మా అమ్మని.
వెంటనే, మా తమ్ముడు అందుకున్నాడు.. "అహా! సావిత్రి, కన్నాంబ" అని నా శ్రీమతిని, మా అమ్మని చూపిస్తూ. గట్టిగా నవ్వుకున్నాం.
ఇంతలో.. "కారులో షికారుకెళ్లే" పాట అయిపోయి, ఏయన్నార్, సావిత్రి మాట్లాడుకుంటుంటే మాతమ్ముడన్నాడు నా వైపు చూపిస్తూ "ఇడిగో నాగేశ్వర్రావు.." అని నావంక చూసి "నువ్వు కూడా అంతే కదరా.. డెలివరీలు, ప్రాజెక్టు డెడ్‌లైనులు, మంత్లీ రిలీజులు, క్వార్టర్లీ రిలీజులు అంటూ వీక్ డేసూ, వీకెండ్లూ అనిలేకుండా ఇల్లు పట్టించుకోకుండా తిరిగేస్తూ ఉంటావుకదా?" అన్నాడు.
నేను సిగ్గుపడి మెలికలు తిరుగుతుంటే .. మళ్లీ నవ్వులు.
...
...
కన్నాంబ చిన్న పిల్లాడిని పక్కన పడుకోబెట్టుకుని కధ చెప్తుంటే, మా తమ్ముడు మళ్లీ, మా బుడ్డిగాడి వంక చూసి, "ఇదిగోరా! ఇది నువ్వే!.."అన్నాడు.
నాయనమ్మ ఒళ్లో కూర్చున్న మావాడు "పో బాబాయ్!.."అంటూ ఆవిడ ఒళ్లోకి మరింత ముడుచుకుపోయాడు..
...
...
"నాన్న! ఇదిగో టిఫిను"అంటూ కూతురు పళ్లెం తీసుకొచ్చిపెడితే, "టిఫినేమిటమ్మా.. అన్నం తింటానుగా" అని ఎస్వీ రంగారావు అంటుంటే "ఇవాళ శనివారం కదా.. టిఫినే తింటావని చెప్పింది పిన్ని"అని కూతురంటే, "ఓహోహో! సుశీల చెప్పిందా.. అయితే సరే" అంటూ ప్లేటు అందుకుంటున్న ఎస్వీ రంగారావుని వేలితో చూపించి, అదేవేలితో నాన్నగారి వంకచూపించాడు తమ్ముడు ఆయన చూడకుండా.. మేమందరం చెయ్యి నోటికడ్డం పెట్టుకుని చిన్నగా నవ్వుకున్నాం, శబ్ధం రాకుండా.
(మా ఇంట్లో మావగారూ, కోడలు ఒక పార్టీలెండి).
"ఏడిశావులే! వెధవాయ్!" అన్నారు గంభీరంగా ఉండే నాన్నారు గుంభనంగా నవ్వుతూ. (మా నాన్నగారికి బాగా ప్రేమ కలిగితోనో, బాగా సంతోషం కలిగితేనో దానికి కారకుడైనవాడ్ని అలాగే అంటారు.ఈమాటంటే, చిన్నప్పుడు మాకు ఆరోజంతా పండగే! :-))
...
...
తనవంతు ఎప్పటికైనా వస్తుందనో, లేకపోతే సినిమాలోనూ, బయటా జరుగుతున్న రెండు సంఘటనల్లో పూర్తిగా invlove అయిపోవడంవల్లనో మా శశిరేఖ తన కారెక్టరుగురించి covenientగా మర్చిపోయింది. కానీ మా తమ్ముడ్ని అడిగింది "మరి నువ్వెవరు బాబాయ్?" అని.
అనుకోవడం ఆలస్యం..అరుగుమీద సావాసగాళ్లతో పేకాట ఆడుకుంటూ రేలంగి పాత్ర ప్రవేశం..
"ఇదిగోనమ్మా! ఇదే నేను" అన్నాడు తమ్ముడు కొద్దిగా ఇబ్బందిగా మొహం పెట్టి.
"నానమ్మా! బాబాయ్ చూడు.. ఎలా ఉన్నాడో" అని మా అమ్మాయి అంటుంటే అందరం గట్టిగా నవ్వుకున్నాం.
ఇంతలో రేలంగి పాత్రని ఆడిపోసుకుంటూ సూర్యాకాంతం పాత్ర ప్రవేశించింది.
అప్పటిదాకా మా అమ్మ ఒళ్లో ముడుచుకునిపడుకుని ఉన్న మా బుడ్డిగాడు ఒక్కసారిగా పైకిలేచి "బాబాయ్! ఈవిడేనా పిన్నీ?" అని అడిగాడు చాలా అమాయకంగా..
కొన్ని సెకండ్లపాటు మేము ఎవ్వరం ఏమీ మాట్లాడలేదు..
అందరం తమ్ముడివంకే చూసాం..
వాడి మొహంలో రంగులు చకచకా మారాయి (చిన్నప్పుడు స్టేజి నాటకాల్లో మొహమ్మీద రంగులకాగితం చక్రం తిప్పినట్టు)
తమ్ముడు బుడ్డిగాడివంక చూసి, ఇంక ఒప్పుకోక తప్పదన్న నిజాన్ని ఒప్పుకుంటున్నట్టుగా "అవును నాన్నా! ఆవిడే మీ పిన్ని.." అని ఆముదంతాగినవాడిలా మొహంపెట్టి నావంక చూసి "మా ఆవిడ ఇక్కడలేదుగాబట్టి బతికిపోయానురాగానీ అన్నాయ్.. తను ఇప్పుడు ఇక్కడ ఉంటేనా.." అంటుంటే.. మేమందరం పొట్టలు చెక్కలు అయ్యేలా నవ్వుతుంటే, మావాడు మా పిల్లలిద్దరితోటీ "ఈ విషయం పిన్నికి చెప్పొద్దూ" అంటూ బ్రతిమిలాడుకునే ప్రయత్నాల్లో పడ్డాడు. :-)

భలే ఉన్నారు.. మీ నవరత్నాలు.. చాలా బావుంది మీ పోస్ట్.
రిప్లయితొలగించండిబావుంది.మీ మరదలు కూడ ఉండి ఉంటే ఇంకా సినిమా రక్తి కట్టి ఉండేదేమో కదా!
రిప్లయితొలగించండి@ప్రసీదగారు: ధన్యవాదాలండీ. :)
రిప్లయితొలగించండి@క్రాంతిగారు: ఔనండీ.. నిజమే! :)
:-) :-) Wonderful
రిప్లయితొలగించండిరవి కిరణ్ గారు ,
రిప్లయితొలగించండిమీ బొమ్మర్లిల్లు లో నటరత్నాలు బాగున్నారండి .
నా కమ్మటికలలు బ్లాగ్ లింక్ ఇచ్చినందుకు చాలా సంతోషం గా వుందండి . థాంక్ యు .
@మురళిగారు: థాంక్సండీ..
రిప్లయితొలగించండి@మాలా కుమార్ గారు: ధన్యవాదాలండీ..
భలే గమ్మత్తు గా చెప్పారు :)
రిప్లయితొలగించండికృష్ణప్రియ
@కృష్ణప్రియ గారు: ధన్యవాదాలండీ..
రిప్లయితొలగించండిlovely....బలే సరదాగా చెప్పారు!
రిప్లయితొలగించండిha ha ha ! మా ఇంట్లో నేను !
రిప్లయితొలగించండి:)) నేను చెప్పేస్తాలెండి ఆవిడతో.
రిప్లయితొలగించండి@ఆ.సౌమ్య, Sujata: క్షమించాలి.. మీ వ్యాఖ్యని "మిస్" అయ్యాను.
రిప్లయితొలగించండిధన్యవాదాలండీ.. :)
@శిశిర: ఎందుకండీ పాపం మావాడి మీద మీకు అంత కోపం..?
ధన్యవాదాలు.. :)
చాలా సరదాగా బావుంది
రిప్లయితొలగించండిసినిమా చూసినప్పటికన్నా ఇప్పుడే... మన ఇంట్లో వాళ్ళని ఆ ఆ క్యారక్టర్ లలో గుర్తు చేసుకున్నాం 👌👌
రిప్లయితొలగించండి