11, ఆగస్టు 2011, గురువారం

భలేమంచి బేరము.. మించినన్ దొరకదు త్వరంగొనుడు..

ఇందు మూలంగా బ్లాగు ప్రజలందరికీ తెలియజేయునది ఏమనగా..

దేవుడు ఒక వరమే ఇస్తాడనీ, అదృష్టం ఒక్కసారే మన గుమ్మం తొక్కుతుందనీ.. ఇట్టాంటివి ఇంతకుముందు చాలాసార్లు మనం విని ఉన్నాం..

కాని.. మనకోసమే.. అచ్చంగా మనకోసమే..

.. దేవుడు ఇంకోసారి వరం ఇచ్చాడని..

.. మనమందరం మూకుమ్మడిగా నక్కతోకని కసాబిసా తొక్కేసామని గమనించిన అదృష్టదేవత అందరికీ కలిపి టోకున ఓ వరం ఇచ్చి ఆవతలపాడేసిందని..

.. అని పైన ఉదహరించినవాళ్లిద్దరూ రాత్రి నాకు కలలోవచ్చి చెప్పారుగాబట్టీ, నేనేమో చిన్నప్పట్నించీ "పరోపకారార్ధం ఇదం.." సూత్రాన్ని విపరీతంగా వంటపట్టించుకున్నవాడ్ని కాబట్టీ, మీ అందరితోగూడా ఆ సువర్ణావకాశంగురించి పంచుకుంటున్నానుగాబట్టి మీరందరూ యధాశక్తి నన్ను మెచ్చుకోవాలని మనవి చేసుకుంటున్నాను..

అసలు విషయానికొచ్చేస్తాను.. మనందరికీ మూకుమ్మడిగా దొరికిన ఆ వరం ఏమిటంటే..

ఈ ఆగష్టు 21వ తారీకున..
....
....
....
సాయంత్రం 5 గంటలకి..
....
....
....
మనందరి మానసచోరుడు, నల్లనయ్య, కన్నయ్య .. ఇంకా పౌరాణిక బ్రహ్మ అయినటువంటి "సుమనో"హరుడి సుమధుర దృశ్యకావ్యం "ఉషా పరిణయం" మనందరి టీవీలో ఠీవిగా ప్రదర్శితం కాబోతుంది, గాన చూసి తరించగలరు..


మురళీగారికి, రాజ్‌కుమార్‌గారికి, ఇంకా ఔత్సాహిక బ్లాగర్లందరికీ "చేతినిండా" మళ్లీ పని తగిలింది..

ఇక్కడ మేమంతా waiting మరి.. రెచ్చిపోండి..

4 కామెంట్‌లు:

  1. ఏమిటీ రెచ్చిపోయేది? ఎవరు రెచ్చిపోవాలి? ఆత్మాహుతి దళాల్లాగా మేమందరమూ అగ్ని లో దూకెయ్యాలా? మీరు ఒడ్డున కూర్చుని మాయాబజారు లో SVR లాగా "ఆర్తనాదములు శ్రవణానందకరముగా నున్నవి" అని ఆనందిస్తారా?
    వీల్లేదు ఈ మాటు మీరు దూకండి. మేము ఒడ్డున ఉంటాము. అంతే.

    రిప్లయితొలగించండి
  2. ఈ టీవీ సుమన్ గురించేనా మీరు చెప్పేది??? అది ఒక్కసారి చూసినందుకే అది కూడా మొదటి పది నిమిషాల దెబ్బకే నెల రోజులు లేవలేదు ఇంకా మళ్ళీ చూస్తే వైద్యులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి.

    రిప్లయితొలగించండి
  3. బులుసు గారు,
    :))) అద్భుతం. భలే బాగుంది మీ వ్యాఖ్య.
    రవికిరణ్ గారు,
    సుబ్రహ్మణ్యం గారు చెప్పారు కదా. ఈసారికి అలా కానిచ్చేయండి. :)

    రిప్లయితొలగించండి
  4. @బులుసు సుబ్రహ్మణ్యం: గురూగారూ.. ఆడవాళ్లని అంటూ ఉంటారు చూడండీ "నువ్వు కోపంలోకూడా అందంగా ఉంటావు" అని.. అలా మీరు కోపంగా (నేనైతే "ఉక్రోషం" అంటానండీ దీన్ని) కామెంటినా కెవ్వు మనిపించారు సార్!. ధన్యవాదాలు. :)

    సరే.. ఎలాగూ మీరు ఒడ్డున ఉండి చూస్తూ ఉంటామన్నారు కాబట్టి దూకే సాహం చెయ్యడానికి ప్రయత్నిస్తామండీ.. సూద్దారి ఎవరి "రాతలు" ఎలా ఉండబోతున్నాయో? :)

    @రసజ్ఞ : అదేంటండీ అలా అంటారు? మురళీగారు లాంటి వారు, సుమన్‌బాబు కొత్త పౌరాణికం ఎప్పుడొస్తుందా అని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.. అట్లాంటివారికోసం ఏదో ఉడతాభక్తిగా.. :)
    ధన్యవాదాలు. :)


    @శిశిర : మంచికిపోతే ఏదో అయ్యిందట.. అలా అయ్యిందండీ నా పరిస్థితి.. :(
    ధన్యవాదాలు. :)

    రిప్లయితొలగించండి